పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవప్రకరణము

"జంటో" సమాజము

ఈ కాలములోఁ దనతోఁ బనిచేయువాండ్రను, పట్టణములో నితరస్నేహితులను సమావేశముచేసి, 'జంటో' అను సమాజము నొకటి బెంజమిను స్థాపించెను. సం|| 40_రములు వఱకు శ్రేయోదాయకముగ, సుఖావహముగ నీ సమాజము వర్ధిల్లుచుండెను. మనుజుల, జ్ఞానము విజ్ఞానధర్మముల యభివృద్ధి కొఱ కీ సమాజము స్థాపింపఁ బడినది. ఎవడైన నీ సమాజ.ములోఁ బ్రవేశింపవలెననిన, నిలుచుండి తనగుండెమీఁద చేయిని వేసికొని, దిగువ వ్రాసిన సూత్రముల కొప్పుదలకావలెను.. ఆ సూత్రములను పొందుపఱచుచున్నారము:-

(1) "సమాజములోనివారి నెవరిని నేను అమర్యాద చేయను.

(2) "ఏ మతస్థుఁడైనను ఏవృత్త్యనుచరణీయుఁడైనను, ప్రతి మనుజుని బ్రేమించెదను.

(3) "పిచ్చియాలోచనలు కలవాఁడైనను తనకుఁ దోఁచిన విధమున ప్రార్ధనచేయువాఁడైనను, సరి వానిదేహమునకు, పేరునకు వస్తువుల కెటువంటి నష్టమును గలుగఁజేయను.