పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందఱను సమావేశముచేసి, తన ఋణముల సంగతిలో వారు రాజీనామా పడినందు కెంతయు సంతసించెను. ఆనాడువారికి విందుచేసి, వారి కియ్యవలసిన సొమ్ము అసలు వృద్ధులతో నితడిచ్చివేసెను. తా నమెరికాలో వెళ్లి వ్యాపారమును సాగించుటకుగాను వస్తుసామగ్రి నింగ్లాండులో గొనెను. సంవత్సరమున కేబది కాసులు వేతనము పుచ్చుకొని తన కార్యదర్శిగనుండుమని డెనుహాము బెంజమినును కోరెను. ఇంతకధికముగ బెంజమినుకు సొమ్ము దొరుకుచుండెను. వర్తక వ్యాపారములో గొంత తేఱిపారినపిదప, మరికొన్ని పనులలో బెంజమినును నియోగించుటకు వీలగునని డెనుహాము వానితో జెప్పెను. డెనుహాము యొద్ద పనిచేయుట కత డొప్పుకొనెను.

లండను, అక్కడి జీవనము,-ఈ రెండును బెంజమిను కసహ్యము పుట్టించి యుండెను. ఫిలడల్‌ఫియాలో నిశ్చింతగ జఱిపిన మాసములను అనేక పర్యాయములు జ్ఞప్తికి దెచ్చుకొని, వానిని బెంజమి నభిలషించుచుండెను. కావున ముద్రాక్షర శాలలోని పనిని విడిచి, వస్తుసామగ్రిని కట్టి యోడ కెక్కించెను. మరి కొన్ని రోజులకుగాని యోడ బయలు దేర లేదు.

ప్రయాణమునకు ముందొక రోజున, ఘనతవహించి, కోశాధ్యక్షుడైన, సర్ విల్లియంవిండుహాము, వర్తమానము