పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంపినందున, వానిని దర్శించుటకు బెంజమిను వెళ్లెను. "నీకీత బాగుగ దెలియునని, నీవిద్దఱి కది నేర్పితి వని, నాలుగుమైళ్లీదితివనియు వినుచున్నాను. నా కుమారులు ప్రయాణోన్ముఖులయి యున్నారు. వారు వెళ్లుటకు పూర్వమే, నీ వీ విద్యను వారికి నేర్పవలయును" అని బెంజమినును 'విండుహాము' వేడుకొనెను. ఇతడు ప్రయాణ సన్నద్ధు డైనందున, దానికి సమ్మతించుటకు వీలు లేక పోయెను. "అమెరికాకు నాప్రయాణము సిద్ధముకాక మునుపు, నాకీ వర్త మానము వచ్చియుండిన, నేను ప్రయాణమును తలపెట్టక, ఇంగ్లాండులో నీతవిద్య పాఠశాలను బెట్టియుందు"నని బెంజమిను వ్రాసెను.