పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహిత మిత డెఱు గును. ఇతడు బాగుగ జదువుకొనినవాడు. ఇతనికిని, ఇతని స్నేహితునికిని రెండువారములలో బెంజమిను, ఈత నేర్పెను. బెంజమిను మంచియీతగాడు. జలశయన, జల స్తంభన మొదలగు చమత్కారములను నేర్చియుండెను. ఒక పర్యాయము, నాలుగు మైళ్లదూర మిత డీదెను. ఇతని నేర్పునకు, యోపికకు మిగుల ముదమంది, బెంజమినునందు వైగేటు బద్ధానురాగముగలవాడై, యీతవలన పొట్టపోసికొనుచు, యైరోపాఖండములో సంచరించి వత్తమా యని ఇతడు బెంజమినును సలహా యడిగెను.

అమెరికానుండి యోడలో గలిసివచ్చునపుడు కలిగిన పరిచయమును బోగొట్టుకొననందున, బెంజమిను 'డెనుహాము' యొద్దకు బోయి, యీ ప్రయాణము సంగతి వానితో ముచ్చటించెను. అతడు విని, ప్రయాణోన్ముఖుడైన బెంజమినును విముఖుని జేసెను. పెన్సిలువానియాకు వెళ్ళు ఆలోచన జేయుమని యతనికి బోధపఱచి, తానుగూడ విశేష వస్తు సామగ్రితో బయలు దేరుచున్నానని డెనుహాము చెప్పెను. ఇతడు వర్తకులలో నిష్కళంకగార్హస్థ్య ధర్మానుచరుడై, వర్తక సంఘమున కదివఱకున్న నిందను బోగొట్టి, క్రైస్తవ దేశములయందు దీనికి నామ రూపములను దెచ్చిన మహనీయుడు. ఇతడింగ్లాండుకువచ్చి, బ్రిస్టలు పట్టణమునకు తన కప్పిచ్చిన వారి