పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క ముఖ్యాభిప్రాయము. ఇట్టి మనోహరమైన గ్రంధము, బలవద్విరోధము లగు బ్రత్యూహలను బెంజమినుకు గలిగించెను. ఆగ్రంథమును ఖండించుచు, నిత నొక ముప్పదిరెండు పుటల పుస్తకమును వ్రాసెను. ఈ గ్రంథమును వ్రాయుట వలన, బెంజమిను గొప్పవాడయ్యెను. దీని ప్రతియొకటి, రణవైద్యుడైన 'లయన్సు' చూచి చదివి సంతసించి, దీనికర్తనువెతకుచు వచ్చి, కని, గౌరవముగ బెంజమినును పలకరించెను. "మానుషాభిప్రాయములు బుద్ధిప్రమాద రాహిత్యము"లను గ్రంధమును లయన్సు వ్రాసెను. ఇత నా కాలపు (Sceptics) సంశయాళువుల పరిచయము గలవాడు. "సారంగములకధ" యను గ్రంధమునువ్రాసి, "సంశయాళువుల సంఘమున" కధ్యక్షుడై యుండిన "డాక్టరు మాండవిలు" దర్శనము బెంజమినుకు లయన్సు చేయించెను. వైద్యుడు, పదార్థవిజ్ఞాన శాస్త్ర వేత్తయు, గణితశాస్త్రజ్ఞుడు, రాజపోషిత సంఘము (Royal Society) లోనివాడు, సర్ ఐజాకున్యూటనుకు స్నేహితుడును, అయిన డాక్టరు పెంబర్టనుగారి దర్శనము బెంజమినుచేసెను. సహస్రమాస వృద్ధై, దుర్బలుడైన న్యూటనును దర్శించుటకు బెంజమినుకు వీలులేకపోయెను. "ఆంగ్లేయ చిత్రవస్తు ప్రదర్శన శాలా" స్థాపకుడు, సృష్టి వై చిత్ర్య సంపాదకుడు (Anti-quarian) నయిన, సర్ హాన్సుస్లోను గారి పరిచయ మీ కాల