పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాల్ఫు వద్దలేని రెండువిశేషములు బెంజమినుకు కలవు. అవి సర్వసాధారణములయినను, బెంజమిను కప్పటికి శ్రేయోదాయకము లయ్యెను. పదికాసులసొమ్ము, చేతిలోని పని-యీరెండును బెంజమినుకు కలవు. వారమునకు పాతిక రూప్యముల సొమ్మును గలిగించు శక్తిగల పనిని బెంజమిను నేర్చియుండెను. విలంబముగాని, కష్టముగాని లేకయే, యిదివఱకే పదుగురు పనివాండ్రున్నను, 'పామరు' కంపెనీలో బెంజమినునకు బని దొరికెను. అతివేగముగ నక్షరములను గూర్చుటయందు బెంజమిను సమర్థత కలవాడు. పనిలో బ్రవేశించుటకు రాల్ఫుచేసిన ప్రయత్నములన్నియు వృధయాయెను. అందుచే, బెంజమిను పోషితవర్గములో నతడుండెను. దరిదాపుగ నొక సంవత్సరము కంపెనీలో బనిచేసి, మంచివేతనములను సంపాదించి, వానిని బెంజమిను వ్యయము జేయుచుండెను.

ఇప్పుడు బెంజమిను జీవితకాలములో జరిగిన యంశమొకటి వినదగి యున్నది. గత శతాబ్దములో జన సమ్మతమై, 'వలాస్టను' చేవ్రాయబడిన 'ప్రకృతిమతవర్ణన' యను గ్రంథ రాజమును ముద్రించుటకు బెంజమిను అక్షరములను కూర్చు చుండెను. జీవహత్య, దొంగతనము, వ్యభిచారము-వీనినినిషేదములని ధర్మ శాస్త్రములు శాసింపక పోయియుండినను వీని నుపచరించుట అకర్తవ్యమని చూపించుటయే గ్రంథకర్త