పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములోనె బెంజమినుకు గలిగెను. "ఆ స్బెస్టాసు" అను చిత్రవస్తువు నమెరికానుండి బెంజమిను తెచ్చెను. దానిని జూచుటకు స్లోనుగా రితనిబసకువచ్చి, కొంతవఱకు ముచ్చటించి, తగిన వెలనిచ్చి, దానిని బుచ్చుకొని, నితనిని తన గృహమునకు దోడుకొనిపోయి, యక్కడనుండు వైచిత్ర్యములను బెంజమినుకు జూపించెను.

ప్రస్తుతముకంటె నధికముగ ధనమును గూడ బెట్టవలయుననికోరి 'పామరు' కంపెనీలో బనిమాని, 'వాట్సను' కంపెనీలో బనిని బెంజమిను స్వీకరించెను. ఇందులో బని జేయువా రందఱు త్రాగుబోతులుగాన, 'ఉదక పానిని' అని బెంజమిను మాఱు పేరిడిరి. హెచ్చరికను పుట్టించు మంచి మద్యమును త్రాగు తమకంటె, నీరుత్రాగి దృడముగనుండు బెంజమిను జూచి వారాశ్చర్యమును బొందిరి. "నాతో బనిచేయువా డొక డుదయమున నొక పైంటు భోజనకాలమున నొక పైంటు, తదుపరి మఱియొకటి, మధ్యాహ్న కాల భోజనము చేయునపుడొకటి, సాయంసమయమున నొకటి, పని ముగిసిన పిదప మఱియొక పైంటు - ఈ విధమున మద్య పానముచేయుట కలదు. అట్లు పుచ్చుకొనినగాని పనిజేయుటకు సామర్థ్యముండదని వాని యభిప్రాయము. ప్రతిశనివారము రాత్రి 3, 4 రూప్యములు సారాయి నమ్మువాని కిత డిచ్చుచుండెను. ఈ ఖర్చు నాకు లేదు" అని