పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు మాటలాడునపుడు, తమయన్యోన్యానురాగము లొకరి కొకరు వెల్లడిచేసికొని, బద్ధులయిరి.

ఇంతలో గ్రీష్మము గడచెను. శరదృతువు అంతము గావచ్చెను. లండనుకుబోవు యోడ సిద్ధముగ నుండెను. అది బయలుదేరు రోజు సమీపించెను. ఆశజూపుచు, లండనులో నున్న తన స్నేహితులకు యోగ్యతా పత్రికల నిచ్చెదనని చెప్పుచు, ప్రతిరోజున తనయింటికి రమ్మనుచు, బెంజమినును గవర్నరు త్రిప్పుచుండెను. బయలుదేరు రోజునకూడ యోగ్యతాపత్రికల నియ్యక, 'న్యూకాసిలు' పట్టణపు రేవుకు వచ్చు సరికి పనిమీద తానక్కడికివచ్చి యోగ్యతాపత్రికల నిచ్చెదనని చెప్పి, బెంజమినును గవర్నరు పంపివేసెను. బెంజమిను పడవ నెక్కెను. లంగ రెత్తిరి. ఓడనడవసాగెను. అందులో జేమ్సు రాల్ఫు', బెంజమినుకు ప్రత్యక్షమయ్యెను. భార్యాపుత్రాదుల విడనాడి, కీర్తిసంపదలను బొందుటకు లండనుకు రాల్ఫు పోవుచుండెను.

ఓడ న్యూకాసిలు రేవులో లంగరు దించెను. గవర్నరును దర్శించుటకు బెంజమిను వెళ్లెనుగాని, వానిదర్శనము కాలేదు. అతని కార్యదర్శి వచ్చి, పనితొందరలో నుండుటచే గవర్నరును జూచుటకు బెంజమినుకు వీలుపడ దనియు, ఇతనికి కావలసిన యోగ్యతాపత్రికలను వెనుకనుండి గవర్నరు పంపుననియు జెప్పి