పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందున చేయుట కేమియు తోచలేదుగాని, మనస్సులోఅపనమ్మకము మాత్రము బెంజమినుకు బుట్టలేదు. బెంజమిను యోడలోనికి వచ్చిచేరెను. అంతలోనే, గవర్నరుపంపిన యుత్తరములను బట్టుకొని, తట్టిమీదికి కర్నలు ఫ్రెంచివచ్చెను. వానిని కప్తానుకు ఫ్రెంచియిచ్చివేసెను. తనయుత్తరముల నియ్యవలసినదని కప్తానును బెంజమి నడుగ, ఇంగ్లాండు వెళ్లులోపున నుత్తరములను సంచిలోనుంచి తీసికొనవచ్చునని కప్తాను చెప్పెను.

నవంబరు 10 తేది నాడు, యోడ సముద్రముమీద బోవుచుండెను. చాల కష్టదినములు యాత్రకు బట్టియుండెను. సంచివిప్పి యుత్తరముల జూడగ, నందులో గొన్నియుత్తరములపైని బెంజమిను విలాసము వ్రాయబడియుండెను. వానిలో నొకటి, రాజుగారి ముద్రాశాలాధ్యక్షునకు, మరియొకటి పుస్తకముల దుకాణదారునకు, చిరినామావ్రాయబడి యుండెను. ఇవి తనవియే యని బెంజమిను తలంచెను.

డిశంబరు 24 తేది నాటికి, లండను పట్టణపు రేవులో నోడ లంగరు వేసెను. ఉత్తరమును పట్టుకొని, వెంటనే బెంజమిను దుకాణదారునియొద్దకు వెళ్లి, గవర్నరు కీతు వ్రాసిప్ంపిన లేఖను, వానిచేతిలో బెట్టెను. గవర్నరు కీతు పేరు వినినతోడనే, "అతనెవరో నేనెఱుగనే" అని దుకాణదారుడు చెప్పి, యుత్తరమును విప్పి చదువుకొని, "ఇది, 'రిడిల్సు'డను అనువాడు వ్రాసిన