పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేర్చెను. ఆస్బోర్ను, రాల్ఫు, బెంజమిను, వీరుమువ్వురు పద్యకావ్యములయం దభిరుచికలవారు. కనుకనే, చాటుపద్యములను వీరు చెప్పుచువచ్చిరి. "ఆదివారములనాడు, విహారార్థ మేటిగట్టునబోవుచు, మేమొకరికొకరు చదువుచు, చదివినదానిని విమర్శించుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను.

ఈ కాలములోనె, బెంజమిను కన్యకరీడుల కన్యోన్యానురాగము బలసెను. ఆరోజులలో, కన్యకను తన కనురాగాస్పదుడైన పురుషుని వివాహమాడనీయక, పరునకిచ్చు స్వాతంత్ర్యము తండ్రికి గల దైనను, దీనినంతగ దండ్రులు బాటించు చుండలేదు. బెంజమిను లండనుకు బయలుదేరి వెళ్లుటకు రెండు నెలలుపూర్వమే, జానురీడులో కాంతరగతుడయ్యెను. ముందుకు తాను ముద్రాశాలాధ్యక్షుడు కాగలనని 'గృహిణిరీడు' తో జెప్పి, తన కామెకూతురునందుగల ప్రేమను బెంజమిను సూచించెను. ఆమె, బుద్ధిమంతురాలుగాన, నితనిమాటలను విని, సంబంధమున కొప్పు కొని, వధూవరులు 19 సంవత్సరములు పూర్తిగ నిండ లేనివా రగుటవలనను, ఇతను ప్రయాణోన్ముఖుడై యుండుటవలనను నాసమయము మంచిదికాదని చెప్పెను. అందువలన, లండనుకు వెళ్లి, తిరిగివచ్చి, పని లోనిలుకడను బొందువఱకు బెంజమిను నిరీక్షింపవలసి వచ్చెను. 'తల్లి రీడు'తో నిటులు నిర్ణయించుకొని, బెంజమిను 'కన్యకరీడు'