పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టికు వచ్చునప్పటికి నెలదినములాయెను. మఱికొన్ని యంత:కలహలములచే బత్రిక తుద కంతరించెను.

తదనంతర మన్న దమ్ముల కలహమధికమైనందున, బెంజమి నన్న నుండి విడిపోయి, సమీపముననున్న 'న్యూయార్కు' పట్టణమునకు బోవుటకు ప్రయత్నించెను. తన పూర్వపు స్నేహితుడు "జానుకాలిన్సు" తాను పడవమీద బోవుటకు దగిన యేర్పాటుచేసినందున, బెంజమిను కొన్ని పుస్తకముల నమ్మి, యాసొమ్ముతో బడవచీటినిగొని ప్రయాణమైపోయెను.

ఈ ప్రయాణములో నొక వింత జఱిగెను. పడవ గడపువారందఱు 'కాడు' చేపలను బట్టుకొని, వానిని మూకుడులో వేసి వేయింపసాగిరి. శాకభక్షకుడైన బెంజమినుకు వానివాసన సోకెను. అంత నతడు మతిచెడి, దీక్షకువ్యతిరిక్తముగ, వానిని తినుట కుద్యుక్తు డయ్యెను.

ప్రయాణము చేయునాటికి, బెంజమిను 18 సంవత్సరముల వయస్సుగలవాడు. మూడురోజులు ప్రయాణముచేసిన పిదప, న్యూయార్కు పట్టణమున కతడు వచ్చెను; పట్టణమం దెవరి నెఱుగడు; చేతిలో డబ్బులేదు; ఎవరిని జూచుటకును తనవద్ద యోగ్యతా పత్రికలు లేవు.

7, 8 వేల జనసంఖ్య గల, న్యూయార్కు పట్టణములో జూచునది వినునది యంతయు 'హోలాందు' మయమై