పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండెను. అందుచే నక్కడి ముద్రాక్షరశాలలం దాంగ్లేయుల కంతగ బనిలేదు. 1723 సంవత్సరమున నీపట్టణమునకు బెంజమిను వచ్చుసరి కక్కడ పుస్తకాలయ మనునదియే లేదు. పేరుకు మాత్ర మొక ముద్రాక్షరశాల కలదు. ఇతను శాలాధ్యక్షుని జూచుటకు వెళ్లి, తన పూర్వోత్తరములను జెప్పుకొని, తన నేపనిలోనైన నియోగింపమని వేడెను. సమయమున కే పనియు లేదని శాలాధికారి చెప్పి, ఫిలడర్ ఫియాలో నొక ముద్రాక్షర శాలాధికారిగ నున్న తన కుమారుని కొక పనివా డత్యావశ్యకముగ గావలసి యుండునని చెప్పి, బెంజమినును బంపివేసెను. ఇప్పటికి, సముద్రపు ప్రయాణమునందలి యుత్సాహము తీరినందున, నింటికి తిరుగు ముఖమగుటయో లేక పని నిమిత్త మన్యపట్టణమునకు బోవుటయో యను మీమాంసలో నతడుబై గ్రామమునకు బోవుటయే యుక్తమని యెంచి, తన వస్తువులను తూపించి పడవలోవేసి తానొక పడవనెక్కి బయలుదేరెను.

ఈ పడవ శిథిలమై చిఱిగిపోయిన తెరచాపతో, యొక కళాసుచే గడపబడుచుండెను. తప్ప త్రాగి మైమఱచిన హోలాందావా డొకడు బెంజమినుతో వచ్చుచు బడవలోనుండి నీటిలో బడగా, వాని జుట్టు పట్టుకొని పైకి లాగి బెంజమిను వానిని బడవలోవేసెను. ఇటులు గొంతదూరముపోయి, "లాం