పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రికలోనొక ప్రకరణమును వ్రాయనిశ్చయించి, బెంజమిను రహస్యముగ వ్రాసి, శాలాధికారి కార్యస్థానమున బడ వేసెను. ప్రభాతానంతరమున సమావేశమైన పత్రికాలేఖకులందఱు క్రమముగ తనవ్యాసమునుచూచి విమర్శించి సంతసించినందున, నతడును మిక్కిలి యుప్పొంగి కన్నుల నానంద బాష్పములను విడిచెను. తదనంతరమది వార్తా పత్రికయందు ముద్రిత మయ్యెను.

రానురాను, 'కోరాన్టు' వార్తాపత్రిక మహాతుంటరియై, పాపాత్ముల కానందసంధాయియై, ధర్మాత్ముల కాగ్రహజనితయై, విచ్చలవిడిగ బోస్టను పట్టణాధికారుల చర్యలు, చట్టములు, సిద్దాంతములు, పరువును సహితము పరిహసించినందున, నధికారులు కాలమునకు నిరీక్షించి 12 మాసము లూరకుండిరి. తుదకు వారి శాంతమును పోగొట్టునంతటి వ్యాసమొకటి ముద్రితమైనందున, వారు దానినిజూచి పత్రికాధిపతియైన జేమ్సు ఫ్రాంక్లినును విచారణకుదెచ్చి, విమర్శనానంతరమున నతనిని కారాగ్రహవాసిగ జేసిరి. కారాగృహమునం దొక వారము వాసముచేసి, తన మూర్ఖత్వము, కుభావము నొప్పుకొని, వినయవిధేయ పూర్వకముగ నపచార క్షమాపణ పత్రికను వ్రాసి, దొరతనము వారికి బంపుకొనెను. వారు కటాక్షించి, విడుదల కాజ్ఞనొసంగ, కారాగృహ విమోచనమై, ఇతను బయ