పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించి బెంజమిను చదువుచుండెను. యజమానుడు పుస్తకము లేకపోవుట వలన గోపగించు నేమోయను భయముగలిగి, సాయంత్ర మరువుగ దెచ్చిన పుస్తకమును మరుచటి యుదయమున నిచ్చి వేయవలసిన ధర్మము గనుక, రాత్రి చాలభాగము మేలుకొని దాని కితడు చదువుచుండెను. "కొంతకాలము గడచిన పిదప, వివేకియు, సూక్ష్మబుద్ధిగల యొక 'మాత్యూ ఆదామ్సు' పేరుగల వర్తకు డొకడు పుస్తక భాండాగారముగలవాడై, మా ముద్రాక్షరశాలకు తఱచుగ రాకపోకలు కలిగి, నన్ను తన భాండాగారమును జూచుటకు రమ్మను మని వేడి, చదువుటకు నేనుగోరిన పుస్తకములను బదులిచ్చుటకు సంతసించెను" అని ఫ్రాంక్లిను వ్రాసెను.

నవీన సుహృదులు తన కప్పుడప్పు డిచ్చు చున్న కావ్యములు చదువుటచే తన పినతండ్రి బెంజమినునుబోలె, యతడుకూడ కవనము జెప్పుట యం నభిరుచికలవాడై, యంత్య నియమములతో గూడిన చరణము లనేకములుగ జెప్పెను. ఈ రచనా శక్తిని సార్థకముగ వినియోగింపవలె నని, నితనియన్న, జేమ్సున కాలోచనపుట్టెను. ఆ కాలమునందు వీధులలో నారుపాటలు పాడుట వాడుకయై యుండెను. సముద్రపు దొంగల సాహస కృత్యములు, సంఘాతకుల నురిదీయ కధలు, దారికొట్టు దొం