పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేను 12 సంవత్సరముల ప్రాయము వాడను. నాకు 21 సంవత్సరము వచ్చువఱకు నేను శుశ్రూష చేసి, యాఖరు సంవత్సరమున కూలివాని వేతనములను బుచ్చుకొనవలయునట. కొద్ది కాలములోబనిని బాగుగ నేర్చుకొని, నాయన్న కెంతో సహకారిగ నున్నాను" అని స్వీయచరిత్రలో బెంజమిను వ్రాసెను.

ఇతను శుశ్రూష చేయుకాలములో, నిప్పటివలె, బోస్టను పట్టణము పుస్తకములకు, విద్యకుస్థాన మని ప్రసిద్ధి కెక్కినది. బెంజమిను పుట్టుట కిరువదిసంవత్సరములు పూర్వము, పుస్తకములమ్మువారయిదుగురుమాత్ర మీపట్టణమునందుండిరి. ఈనాటికి పదిమంది పోగయిరి. కావలసిన పుస్తకముల నింగ్లాండునుండి తెప్పించి, నిలవచేయుటయేకాక, మతోపన్యాసములు, వివాద గ్రంథములు, పంచాంగములు, నారుపాటలు, (Ballads) చిన్న పుస్తకములు మొదలగువానిని ముద్రింపించి ప్రచురించుచుండిరి. వీరికి దైవిక గ్రంధములే మూలాధార మయినవి. అయినను మాతృ దేశమందు బుధులు పరనచేసెడు ముద్రిత నూతన గ్రంధములన్నియు, నూతనసీమలకు (Colomes) దేబడి, యక్కడి పట్టణము లందలిసాహిత్య విద్యానైపుణులచే ధారాళముగ జదువబడుచుండెను.

పుస్తకములు గొనుట కశక్తుడైనందున, పుస్తకములమ్మువారివద్ద పనిచేయువాని సహవాసమూలముగ వానిని