పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గల పరాక్రమములు, భయావహమైన యోడల విధ్వంసనములు, ఘోరమైన పాపములు, తదితర తత్కాల సంప్రాప్తానుభవాధిక్య విషయములు, నివి, యన్నియు శోకరసాశ్లిష్ట ఛందోనిబద్ధ కావ్య స్వరూపాలంకృతంబులై, గ్రామపుర సీమలయందమ్మబడుచు వచ్చినవి. అన్నగారి ప్రోత్సాహమున, బెంజమిను సర్వజన సమ్మోదసఫలైకరచనాయత్త చిత్తుండయ్యెను.

తన కవనము రసవిహీన మైనదని బెంజమి నొప్పుకొనెను. ఇతనియన్న లక్షణ విరుద్ధము లయిన కావ్యములను ముద్రిపించి, చెల్లుబడికై పైగ్రామములకు బంపుచువచ్చెను. అయినను, కుమారుని సద్బుద్ధినిరక్షింపవలయునని. అతని రచనా లోపములను జూపించి, యిట్టి లక్షణ విరుద్ధకవులు దరిద్రులగుదు రని చెప్పి, యీక వనరచనయం దెన్నటికిని యాధిక్యతను బొందుట కష్టమని బెంజమినుకు జూపించి, దాని నతడు విడుచునటుల తండ్రిచేసెను. తండ్రిగారి విమర్శనల మూలముగ, బెంజమిను శృంగారరచన గద్యశైలిని వ్రాయుటకుద్యుక్తు డాయెను.

వాదప్రియుడు, మాటకారియు, గ్రంధపఠనలోలుడైన 'జానుకాలిన్సు' అను నత డీతని కీసమయమున సహకారియై యుండెను. పితృ సంబంధ వివాద వైదిక గ్రంధపఠన మూలమున, ఫ్రాంక్లినుకూడ వివాదోద్ధిత చిత్తుడైనను, తుదకీ