పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుర్గుణాతీతు డయ్యెను. శాస్త్రాభ్యాసము స్త్రీల కెంతవఱకు సార్థకమో యనెడి వాదము స్నేహితు లిరువురికి జరిగెను. శాస్త్రజ్ఞానము స్త్రీలకు గలుగదని కాలిన్సు, గలుగునని ఫ్రాంక్లిను, వాదించిరి. మంచివాగ్ధోరణి లేనివాడుగాన, వాదములో స్నేహితుడు చెప్పిన హేతువులకంటె, నతనివాక్ప్రవాహమే తనను నోరు మూసికొనునటుల చేయుచున్నదని బెంజమి నభిప్రాయపడెను. ఇదమిద్దమని నిర్ణయింపకయే, స్నేహితులకు వియోగము కలిగెను. కొంతకాలమువఱకు వీరు కలిసికొనుటకు వీలు లేక పోయినందున, తన వాదములయొక్క సారాంశములను వ్రాసి బెంజమిను కాలిన్సుకు పంప, నతను వానిని జదివి బ్రత్యుత్తర మిచ్చెను. ఈ యుత్తరప్రత్యుత్తరము లొకనాడు తండ్రిచూచి, వాదాంశము నెత్తక, ప్రతివాదియొక్క నిర్దుష్టశైలిని స్తుతించెను. వర్ణక్రమమందు. వాక్య విరామస్థాన నిబంధనయందు, బెంజమిను నిర్దోషియని చెప్పి, స్పష్టత, సొంపు - యీ రెండును ప్రతివాది శైలిలో గనబడుచున్నవని నిదర్శన వాక్యములను తండ్రి సూపించెను. తండ్రి చేసిన యాక్షేపణ న్యాయమనితోచి, నాడు మొదలు బెంజమిను తనశైలిని జక్క బెట్టుట కుద్యుక్తుడాయెను.

నానావిధ గ్రంధపఠనమునకు, శుశ్రూష చేయుచున్న బెంజమినుకు కాలమెటుల సమకూరెను? సాయంసమయముల విరామ