పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"తనయాశ్రమ ధర్మమెవడు పూనికతో నడపునో, వాడు మూర్ధాభిషిక్తుల సాన్నిధ్యమును బొందును; తుచ్ఛులను బొందడని," రాజర్షియైన సాలమను చెప్పిన నీతివాక్యమును తండ్రి తన స్ఫురణకు సదా తెచ్చుచుండెనని తన స్వీయ చరిత్రలో ఫ్రాంక్లిను వ్రాసియున్నాడు. ఏబది సంవత్సరములు గడచిన వెనుక డాక్టరు ఫ్రాంక్లినని పేరువహించి, రాజన్యుల సాన్నిధ్యముననుండి, యీ నీతివాక్య మితడు స్మరణకు దెచ్చుకొనుచుండె నట.

పనులు పుచ్చుకొనుటయం దంతగా కాఠిన్యమును తండ్రి వహింపనందున, బాలక్రీడలయందు విహరించుటకును, పుస్తకములు చదువుటకును బెంజమినున కవకాశము దొరకుచుండెను. సముద్రతీరమున నివసించుటచే, జలక్రీడలయం దామోదము బెంజమినునకు కలుగుట సహజము. చిన్న పడవలను నడపుటయందేకాక, యీదుటయందుగూడ, ప్రావీణ్యమును ఇతడు కొద్దికాలములోనే సంపాదించెను. ఈతయందత్యధిక మోహముగలవాడై, వయస్సు ముదిరనను దానిని బ్రేమతో జూచుచుండెను. నేర్చుకొనదగిన ముఖ్యాంశములలో దీనిని నొకదానిగ నెంచి, తన యభి ప్రాయమును స్థిరపఱచుటకై యనేక వ్యాసములను వ్రాసెను.

ఒక రోజున గాలిపటమును వినోదార్థమెగరవేసి, దరిదాపుగ మైలు వెడల్పుగల యొక సరస్సు సమీపమునకు వచ్చి,