పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వము మొదట -----ములకు గ్రాహ్యమై, తదనంతరము మనకు ---- వారిని జూచు భాగ్యములేదు, వారి చర్యలను వినుటకు నోము నోచుకొనలేదు. వారి నెఱిగినవారినైన గన్నులారజూచుటకు దగినంతపుణ్యమైననుజేయలేదు; అట్టి మహాపురుషులు ప్రపంచములో నొక కాలమున జీవించియుండిరను జ్ఞానమైనను మనకు లేదు.

ఇటులకూపస్థమండూకమువలె, బుట్టుచుగిట్టుచు, చిర్వితచర్వణులై, విషయములకులోబడి కాలమును గుర్తెఱుగక, పశువులవలెప్రజలు సంచరించుచున్నారు. ఈ యజ్ఞానమును బోగొట్టుకొనుటకు, వారు గురువుల నాశ్రయించవలెను. దానిని బోగొట్టినవి గురూపదేశములు కావా? స్వయముగ వారి వలన వినుటకు దగినంత యదృష్టములేదు. ఆయుపదేశములే, లిఖితరూపమును బొంది, జీవితచరిత్రములయినవి.

           "యదా యదాహి ధర్మస్యగ్లావిర్భవతి భారత |
           అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మాము సృజామ్యహం
           పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం |
           ధర్మసంస్థాపనార్ధాయ సం వామి యుగే యుగే ||"

ఏ యే కాలములో బ్రజలు ధర్మమార్గము విడనాడి, యధర్మమార్గము బొందుదురో, యా యా కాలములలో బురుషోత్తముండు తన నిజవిభూతిని దెలుపుటకు బ్రపంచములో దనకుళ చేత మహాపురుషుల నుద్భవింపజేసి, వారిచేత లోకముల నుద్ధరింపజేయును. వారినే మనము క్రైస్తువని, మహమ్మదని, గౌతమబుద్ధుడని, శంకరుడని, ఆనందతీర్థులని, రామానుజులని, కన్ఫూశియనని, లూథరని మొదలగు నామములతో స్మరించుచున్నాము. వారిలో నెంత మహాత్మ్యముండక పోయిన, ననేకకోటి ప్రజలు వారిని ప్రతిదినము స్మరించుటయే గాక, వారిసిద్ధాంతములను బరించి, వారి ధర్మముల నాచరించుచున్నారు.