పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాధుజనరక్షణ, దుష్టజనదండన వీనికై బరమేశ్వరుం డనంతకోటి జన్మముల నెత్తి భూభారముదగ్గించెను. పురాణములలో జెప్పిన యవతారములే గాక, మఱియెన్ని యవతారము లాయన యెత్తెనో మనము చెప్పలేము, లోక కంటకులను సంహరించకపోయినయెడల, లోకములకు స్వాస్ధ్యముండునా? కనుక, మహావీరులందఱు భగవంతుని కళలని తెలియనగును. థాతువు లుద్రేకించి, శరీరమును గష్ట పెట్టుచున్నప్పుడు, స్కంధత్రయము దెలిసిన వైద్యుడు వానిని శాంతింప జేయువిధమున, సంగపంచకము గుర్తెఱిగిన మహావీరులు చతురంగముల నడిపించి, దేశములకు మేలుగలుగంజేయుదురు.

దేహము స్వస్థతగ నుండినపుడు, హృదయకమల మెటుల నాళములలోనికి బరిశుద్ధరక్తమును బంపునో, యటులనె, దేహములు చల్లబడి యర్థప్రాణములకు నెమ్మదిగలిగినపుడు, శాస్త్రజ్ఞులు, వేదాంతులు, పండితులు మొదలగు ప్రాజ్ఞులు బయలువెడలి, వారి వారి యుపన్యాసములచేత, బోధనలచేత, ప్రత్యక్ష నడవడికలచేత బ్రజల యజ్ఞానమును బోగొట్టుదురు. వైతాళికులవలె, వీరు మనుజులను మోహనిద్రనుండి మేలుకొలుపుదురు. అనేక జన్మములలనుండి వచ్చుచున్న యజ్ఞానము మనస్సునుబట్టి యాక్రమించి యున్నందున, వీరి ప్రబోధనములచె, వారికి ప్రబోధోదయమగుట కష్టము. అందు చేత, మనము నిరాశజేసికొని, దిగులొందవచ్చునా? పఠనము, వ్యాసంగము, మననము, ఆచరణవిధానములయం దానిని మేలుకొలుపవలెను. దౌవారికుడైన మనస్సు జాగరూకతతో నుండకపోయిన, బుద్ధి చెడును. బుద్ధినాశాత్ర్పణ్యుతి, బుద్ధి చెడుట మనుజుడు చెడుట ఈ రెండు నొకటే. మనస్సును మేలుకొలిపి, బుద్ధిని వికసింపజేయ వారె, కాళిదాసులు, షెక్స్పియరు, ప్లేటో, సోక్రటీసు, గాథె మొదలగువారు. సూర్యుడొక్క బాహ్యలోకమునకే వెలుగు నిచ్చునుగాని, వీరంతర్భహిర్లోకములం బ్రకాశింపజేయుదురు.

వర్తమానకాలము నధిష్ఠించి, భూతకాలావళిగండ జూచిన, మనకు సమీపముననున్నవి. దృశ్యములై, దూరముననున్నవి యదృశ్యము లగుచున్నది.