పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరీరము నాశ్రయించుకొని మూడు ధాతువులు, పంచప్రాణములు లున్నవి. వీనిలో బ్రాణవాయువు, పైత్యము ముఖ్యమైనవి. భేషించిన వాని విని యుద్రేకించనీయవు, అటుల నె, లోకములో సజ్జనులు, వారు దుర్జనుల నణగగొట్టుదురు. --- డెటుల సజ్జనుండయ్యెనో, యెటుల తన జీవిత కాలములోసాధువుల రక్షించెనో'దుర్జనుల శిక్షించెనో, యెవరితో మైత్రి జేసెనో, యెవరితో వైరము బాటించెనో, బాల్య యౌవన కౌమార వార్ధకదశల నెటుల గడిపెనో, బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మముల నెటుల ప్రవర్తింప జేసెనో, దేనియందు ఈయంశములు సవిస్తరముగ వ్రాయబడి యుండునో అదియే 'మహాపురుషుని జీవితచరిత్రము', ఈ మహాపురుషుల సంక్షిప్తచరిత్రయే 'దేశచరిత్ర'.

వారి, చెయంబడిన కార్యములయొక్క ఫలముల ననుభవించుటచేత, మనకింత యౌన్నత్యము, నాణెము వచ్చినపుడు, వారివలె మనముగూడ మహత్కార్యములను యధాశక్తిజేయ సమకట్టినయెడల, మన మెటువంటివారమగుదుము, వానిని నెర వేర్చినయెడల, వారి కార్యములకు దేశకాలపరిమితి లేదు, మన కార్యములకు గలదు. 'ఆత్మవత్సర్వభూతాని' అను న్యాయము వారియందుబ్రవర్తించెను.

సూర్యచంద్రు లుదయించుచున్నారు, అస్తమించుచున్నారు. అటులనె గ్రహములు, నక్షత్రములు, పరిపాటియగుట త, నివిమన దృష్టిని యరికట్టుట లేదు. 'హాలీ' తోకచుక్క, తుపానులు మొదలగు ప్రకృత విపరీతములు మనసృష్టి నాకర్షించుచున్నవి. అవి శాశ్వతమైనవి; ఇవి క్షణభంగురములు అటులనె మహాపురుషులు, వారి కార్యములు, దుర్జనులు, వారి కృత్యములు.

వారి కాలములో వారు మహత్తుగలవారని పరు లెరుగరైరి. సామాన్యులవలె వారుగూడ సుఖదుఖము లనుభవించిరి. సూర్యకాంతి మొదటనధిత్యకలమీద బ్రసరించి, క్రమముగ నుపత్యక భూములకు దిగునటుల, వారిప్రభా