పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంజమిను శరీర దార్డ్యముకలవాడు. ఇతడు పెద్దకాలమునకు స్థూలదేహియయ్యెను. అయిదడుగుల తొమ్మిదంగుళము లున్నతముకలవాడు. పిల్లికండ్లు, తెల్లని శరీరము కలవాడు. నెమ్మదిగ మాటలాడువాడు. అతని కనవసర మగు పనులలో నతడు జోక్యము కలుగ జేసికొన లేదు. అందఱితోను గలిసిమెలిసి తిరుగుచు, కలుపుకోలుతనముగ నుండెను. తన ప్రియస్నేహితులతో మనస్సు నిచ్చి మాటలాడుచుండును. పరులతో నంతగ మాటలాడువాడుకాడు. జ్ఞానము, లోకజ్ఞానము కలవాడు.

         యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జిత మేవవా |
         తత్తదేవావగ చ్ఛత్వం మమతేజోంశసంభవమ్ ||