పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞానచంద్రికా గ్రంధమాల.

నియమములు

1. దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంధములు ప్రచురించి భాషాభివృద్ధి చేయుటయే యీగ్రంధమాల యొక్క యుద్దేశ్యము. ఇందు సంవత్సరమునకు రమారమి 1600 పుటలు గల స్వతంత్రమైన గ్రంధములు ప్రచురింపబడును.

2. కొందఱు తలచునట్లు ఇది మాసపత్రిక కాదు. ఇందు దేశ దేశముల చరిత్రములును, పదార్థవిజ్ఞాన, రసాయన, జీవ, వృక్ష, మొదలగు ప్రకృతి శాస్త్రములును, దేశోపకారులగు కొందఱు మహనీయుల చరిత్రములును, ఇంగ్లీషు నందలి ఉద్గ్రంధముల భాషాంతరీ కరణములును మాత్రము ప్రచురింపబడును. చరిత్రాను సారములగు కల్పితకధలు (Historical Novels) గూడ ప్రచురింపబడును.

3. ఈ గ్రంధమాలలో నిదివరకు అచ్చువేయబడిన గ్రంధముల నన్నిటిని కొనుచు నికముందు ప్రచురింపబడు గ్రంధముల నన్నిటినిగొనుటకు నొప్పుకొనువారు శాశ్వతపు చందాదారులు.

4. శాశ్వతపు చందాదారులకు ఈగ్రంధమాలలోని గ్రంథములన్నియు అర్ధ వెలల కియ్యబడును. సంవత్సరము ఒక్కింటికి 1600 పుటలకంటె నెక్కువ పుటలుగల గ్రంథములు మేము ప్రచురించము. చందాదారులకు సంవత్సరమునకు రూ 4-0-0 కంటె నెక్కుడు కర్చుకానేరదు.