పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహాయమును సాంత్వనమును తాతగారి కిచ్చుచుండెను. ఇతనిభార్య ఫిలడల్‌ఫియాలోనుండి పోయెను. ఆమె భర్త రాక మనమున నిరీక్షించుచు, స్వగృహమున జరిగిన వృత్తాంతముల నతనికి దెలియ జేయుచుండెను. ఇంతకాలమున కితని కూతురును వివాహమాడుటకు, ఫిలడల్‌ఫియాలోని వర్తకుడు, 'రిచ్చర్డు బేచి' అనువాడు నిశ్చయించి, గృహిణి బెంజమినుతో నీ సంగతిని జెప్పెను. భర్త కీ సంగతి నామె తెలియజేసెను. కొంతకాలమునకు వారిరువురు వివాహమాడిరి.

బెంజమిను పదిసంవత్సరము లింగ్లాండులో నుండెను. తన స్వదేశాభిమానము, లోకోపకార బుద్ధిని పనులలో జూపించుట కితడు కష్టపడుచుండెను. ఒక సమయమున వైద్యశాలను జూచిన, ఫిలడల్ ఫియాలోని వైద్యశాల యితనికి జ్ఞప్తికి వచ్చుచుండును. పట్టుపురుగులను బెంచువిధము, వానినుంచి పట్టును తీయువిధమును గుఱించి తగిన సమాచారమును సంగ్రహించి, పెన్సిలువానియాలోని తన స్నేహితుల కితడు పంపుచుండెను. పట్టుపురుగులను బెంచుటకు పెన్సిలు వానియాలో గొందఱు బయలుదేరిరి. ఇంగ్లాండు రాణీగారికి స్వదేశము నుండివచ్చిన పట్టును బహుమానముగ నిత డిచ్చెను.

1771 సంవత్సరములో కప్తాను 'కుక్కు' భూగోళ యాత్రను సముద్రముమీద చేసి, తిరిగి వచ్చెను. ఇతడు, 'యార్కుపి