పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దును గూడపొందెను. ఈ గౌరవములను బొందిన తరువాత, నమెరికా దేశమునకు వచ్చెను.

15 సంవత్సరముల వఱకు కష్టపడి, 57 సంవత్సరములు వయస్సున శేషించిన జీవితకాలమును సుఖముగ గడుపుటకు డాక్టరు బెంజమిను తలంచెను. 1748 సంవత్సరములో, పనులను మాని శాస్త్రపరిశోధన జేయవలె నని యితడు కోరెను. గృహ మిరుకటముగను, విరివిగను కట్టి, స్నేహితులతో ముచ్చటించుచు, తన పశ్చిమవయస్సు నంతము జేయుట కిత డుద్దేశించెను. ఈ కోరిక స్వప్నావస్థయయ్యెను. సంఘటిల్లిన వ్యవహారములలో బట్టువడి, వాని ప్రవాహములో గొట్టుకొని పోయినందున, కోరిన కోరికను పొందుట కితని కవకాశము లేకపోయెను. యుద్ధము సన్నద్ధమైనందున, నితడు గ్రంధపఠనము మానివేసెను. 1763 సంవత్సరము మొదలు 1770 సంవత్సరము వఱకు ఆంగ్లేయులకును ఫ్రెంచి వారికిని యుద్ధము జరుగుచుండెను. 1764 సంవత్సరములో వ్యవహార రీతనిపట్టి, బెంజమి నింగ్లాండువెళ్లెను. అక్కడ లండను పట్టణములో నతడు కాపుర ముండెను. కొంతకాలము రాజకీయ వ్యవహారములను జూచి, తదనంతరము వానిని వదిలి, రిత్తగ నతడు కాలాయాపనము జేసెను. 1770 సంవత్సరమున నితడు లండనులో నుండెను. ఇతని మనుమడు "విల్లియంటెంపిలు ఫ్రాంక్లిను" అను వా డితని యొద్దనుండి, కోరిన