పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యరు'లో నొక సేద్యకాని కుమారుడు. 'పసిఫిక్కు' మహాసముద్రముమీద యాత్రచేసి, దానిలోని వింతల నితడు చెప్పెను. 'న్యూజీలాండు' దీవిని మొదట నితడు జూచెను. ఈ కాలములో నితని సంగతుల నందఱు ముచ్చటించుచుండిరి. పసిఫిక్కు దీవులలోనున్న వారు ధైర్యశాలు లని, ధాన్యము, పశువులు, కోళ్లు లేని వారని యైరోపా వాసులకు దెలిసెను. ఈ వస్తువులను వారికి పంపుటకు బ్రయత్నముచేసి, చందాలు వసూలుచేసిరి. బెంజమిను తనకు తోచిన చందా నిచ్చెను. కొన్ని కారణములచేత నీపని సాగ లేదు.

ఇతడు ప్రయోగము లోనికి దీసికొని రాని స్వల్పవిషయ మేదియు లేదు. ఒక నా డితని భోజనకాలమున, 'వర్జీనియా' దేశమునుండి తేబడిన 'మదీరా' మద్యమును సీసాలో నుండి పాత్రలోనికి బోయునపుడు, చచ్చిన మూడీగలు పడినవి. "చచ్చిన యీగలమీద సూర్యకిరణములు ప్రసరింప జేసినందున, నవి పునర్జీవమును బొందు నని విని, నేను వీనిని యెండలో బెట్టితిని. మూడు గంటలలోపున, వీనిలో రెండు చైతన్యమును బొంది, కాళ్లు కదిల్చి, కండ్లునులుపుకొని, రెక్కలను విదలించి, తామింగ్లాండు దేశమునకు వచ్చిన సంగతిని తెలియక, యెగిరిపోయెను.మిగిలినదానిని, సాయంకాలము వఱ కెండలో నుంచితినిగాని దానికి జీవమురాలే"దని బెంజమిను వ్రాయుచు,