పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిని సంస్కరించుటకు బెంజమిను సమకట్టెను. 1753 సంవత్సరము గ్రీష్మఋతువులో, దేశములోని తపాలాఫీసులను బరీక్షించుటకు బయలు దేరెను; నాలుగు సంవత్సరముల వఱకతడు కష్ట పడెను. జనుల కుపయుక్త మగు గొన్ని సంస్కారములను బెంజమిను చేసెను. 1753 సంవత్సర మంత మగునప్పటికి, రాజు, గవర్నరు, పట్టణపుపెద్దలు, వీరిచే బనులలో బెంజమిను నియోగింప బడెను. విద్యుచ్ఛక్తి పరిశోధకు డని పేరు వచ్చెను. అమెరికాలో నితని పేరు తెలియని వారులేరు.

నిరాటంకముగ నెనుబదిసంవత్సరము లభివృద్ధిని జెందిన పెన్సిలువానియా పరగణాకు దుర్దినములు సంఘటిల్లెను. ఈ దినములలో నితనిని సేనా నాయకునిగ నియోగించిరి. ఇతని సేనాధిపత్యములో సైన్యములు బాగుగ నడుపింపబడెను. ఈ యాధిపత్యము ననుసరించి, సంధిచేయుట కితడింగ్లాండుదేశము వెళ్లెను. అక్కడ మూడు సంవత్సరము లుండి, తన సందేశము నతడు నిర్వర్తించుకొనెను. కార్యనిర్వాహము కేవల మితడు గోరిన ప్రకారము జరుగపోయినను, నష్టము మాత్ర మితనికి కలుగ లేదు.

ఇంగ్లాండులోనున్న సమయమున బెంజమి నక్కడి పండితుల సహవాసము చేసెను. 'ఆక్సుఫర్డు' సకల కళాశాలాధ్యక్షులు బిరుదులు కొన్నితని కిచ్చిరి. ఇతడు 'డాక్టరు' అను బిరు