పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముంచడు. నేనొక్కొక్కప్పుడు పొందుకష్టములు నామేలున కతడు పంపును" అని మతమును గురించి తనయభిప్రాయమును దెలిపి యున్నాడు.

పుస్తకములను చదువుటకును, మననము చేయుటకును, స్నేహితులతో సంభాషించుటకును బెంజమినుకు కాలము దొరక లేదు. ఇతడు సర్కారుపనిలో ప్రవేశించిన జూడవలయునని కోరినవారికోరిక నీడేర్చుటకు దగిన కాలము సమకూరెను. పెన్సిలువానియా పరగణాను రక్షించుటకు చేసిన సన్నాహము వలన, ప్రజలు, స్వగ్రామస్థులు సంతోషించుటయేకాక, రాజ్యాంగముల వారు కూడ సంతసించిరి. "నేను రిత్తగ నుంటి నని యెంచి, ప్రజలు తమపనులను నెర వేర్చుకొనుటకు నన్ను పట్టిరి; పట్టణపుపెద్దలు కూడ నన్ను బనిలోనికిలాగిరి" అని యితడు వ్రాసెను.

1753 సంవత్సరమున, "అమెరికా పోస్టుమేస్టరు జనరలు" మృతినొంది నందున, బెంజమిను, విల్లియంహంటరు, వీరిరువురి నాపనిలో సర్కారువారు నియోగించిరి. ఎన్నడు నమెరికాలోని తపాలాఫీసులవలన డబ్బువచ్చుటలేదు. వీరు వానిని సంస్కరించి, లాభము వచ్చునటుల జేసిన, వీరికి మూడువందల కాసులు చొప్పున వేతన మిచ్చుటకు వారునిర్ణయించిరి. అందఱికంటె, దేశ సమాచారములు తనకు బాగుగ దెలిసినందున