పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనులలో నేదియైన చేయవలయు నని నిర్ణయించుకొని, వారు సరిసమముగ నాడుచు వచ్చిరి. ఈ విధమున, నిటాలియా భాషను వీరు సాంతముగ నేర్చిరి. ఈ భాషలను బూర్ణముగ జదివి, 'లాటిను' భాషను జదువ నేర్చి, దాని నితడు తుద ముట్టనభ్యసించెను.

సంగీతమును విలాసార్థముగ నిత డారంభించి, యెక్కుడుత్సాహముతో దానిని నేర్చుకొనెను. ఇత డన్ని వాయిద్యములు వాయించుట యెఱిగి, స్వరజ్ఞానమును బొందెను. ఇతడు ప్రకృతిని కన్నులు విప్పి పరీక్షించుచుండెను, దాని సంపద్వైభవములకు సంతసించు చుండెను. ఇతడు ప్రకృతిలో మునిగి యుండెను.

'స్వీడను' దేశపు సర్కారుచే పంపబడిన, వృక్షశాస్త్రజ్ఞుడు 'కాము' అను నతడు, 174 సంవత్సరములో బెంజమినును జూచెను. వీరిరువురికి స్నేహముకలిగెను. 'తమలోదాము మాటలాడుకొను శక్తి చీమలకు కల దనుటకు నిదర్శనముగ, నొక స్వానుభవ విషయమును బెంజమిను నాతో, జెప్పెను. పంచదారను చీమచూచి, తనకన్నములోనికిపోవును. కొంతసేపటికి, వందలు వేలు చీమలు వచ్చి, పంచదారను తీసికొనిపోవును. అటులనే, చచ్చిన యీగను జూచి