పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తానొక్కటి దానిని మోసికొని పోలేక పోయిన పక్షమున, వెంటనే చీమ కన్నములోనికి బోవును. క్రమక్రమముగ, చీమలు ప్రాకుచువచ్చి, దానిని తీసికొనిపోవును. ఒక సమయమున చిన్న కుండలో తేనెవేసి, దానిని పదిలముగ బెంజమిను దాచెను. దానిలోమెల్లగ ప్రవేశించి, కొంత తేనెను చీమలు తినివేసెను. వానిని జూచి దులిపి వేసి, యాకుండ నింటి వెన్నుకు త్రాటితో నతడు వ్రేలగట్టెను. పొరబాటున నొకచీమ దానిలోనుండి పోయెను. పైకి ప్రాకిపోవుటకు వీలు లేక, నటునిటు తిరిగి, త్రాడుమీదుగ వెన్నుకుపోయి, తప్పించుకొని క్రిందికి దిగెను. ఇది దిగిన మరియొక యరగంటకు వంద చీమలు గోడమీద ప్రాకుచు వెన్నెక్కి, త్రాడుమీదుగ కుండలోనికి దిగిపోయి, తేనెను తిను టకారంభించెను. తుదకా తేనే నంతయు నవి తినివేసెను". అని, తనతో బెంజమిను చెప్పినట్టు, స్వీడనుదేశపు పండితుడు వ్రాసెను.

బుద్ధిమంతు లేసంగతిని జూచినను లెస్సగ విచారించుదురు. తుపానుల మార్గమును కనిపెట్టి చెప్పుటకు బెంజమిను కవకాశమయ్యెను. "పూరురిచ్ఛర్డు" పత్రికలో, నొక నాటి రాత్రి 9 గంటలకు చంద్రగ్రహణము పట్టునని, వ్రాయబడియుండెను. దానిని జూచుటకు బెంజమిను సమకట్టెను. గ్రహణము పట్టుటకు పూర్వమొకగంట కీశాన్యమూలనుండి, గాలి