పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మాచరణము నితడు పూర్ణత్వమును బొందగోరెను. ఏకాలమందును తప్పుచేయక యుండవలెను. పొరపాటుచేత జేయు స్నేహితుల ప్రోద్బలము చేతజేయు, తప్పులను ముందుకు జేయకుండుటకు నేను ప్రయత్నించితిని. 'ఇది తప్పు' , అదియొప్పు' అని నాకు తెలియిను. అట్టి స్థితిలో, తప్పునుమాని, యొప్పు నెందుకు నేను చేయరాదు? ఇదియే కష్ట మని తోచుచున్నది. ఒక తప్పును మానివేయుటకు ప్రయత్నించినందున, నకస్మాత్తుగ మరియొకటి చేయనగుచున్నది. అజాగ్రత్తగ నుండుట వలన, నే నలవాటు చేత తప్పు, మార్గములోనికి వచ్చుచుంటిని. బుద్ధిలేనందున, నామనస్సు విచ్చలవిడిగ వెళ్లుచున్నది." అని బెంజమిను వ్రాసెను.

అత డాచరణలోనికి దెచ్చిన ధర్మము లివి:- యుక్తాహారము, మౌనము, క్రమము, శాంతము, దాంతము, నిర్మలము, శుచిత్వము, పత్నీవ్రతము, అణకువ, శ్రద్ధ, భక్తి, న్యాయము, క్షుప్తిత ఈ పదమూడు ధర్మములను వారమున కొక్కొక్కటి చొప్పున యాచరణ జేయుచు బ్రతిధర్మమునకు సంవత్సరమునకు నాలు గావృత్తుల నిత డిచ్చుచుండెను. ఇది సానుకూలముగ తుదముట్టుట కష్టమని తోచెనుగాని, కొన్నిరోజులకు వీనిలాభము స్పష్టముగ నతనికి గనబడెను.