పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని ధర్మములలోను, రెండుమాత్ర మితడు ప్రవృత్తిలోనికి దెచ్చుటకు వీలులేకపోయెను. అవి, "క్రమము, అణకువ". పేరుకు మాత్రముగాని, నిజమైన యణకువ తనకు లేదని యతడు వ్రాసెను. గర్వము పాపిష్టిది. దానికి బదులు, యణకువయుండి, మనుజుడందుకు గర్వించిన బాగుగనుండును. క్రమముగ బనిచేయుట కొంచె మితనికి దెలియును. అయిన, నేపని నెప్పుడు చేయవలయునో, యేయేవస్తువు నెక్కడ నుంచవలయునో, బెంజమినుకు బాగుగ దెలియదు.

అన్ని ధర్మములను సానుకూలముగ నాచరణలోనుంచి, మనుజు లెంతో శ్రమపడిన పక్షమున, నొక ధర్మమునందు వారికి స్థిరబుద్ధి కలుగును? ఒక సమయమున మనకొక ధర్మమునందు బుద్ధికలిగినను, మనమాత్మ నిగ్రహము మాత్రము చేయ లేము. అభ్యాసమువలన నిది పొందవలసినదియేకాని, మరియొకటి కాదు. బెంజమి నాచరణచేసిన విధ మతని దేశ కాలావస్థల కనుగుణ్యముగ నున్నది. అంతకు మించినది మంచిది నీకు తెలిసిన, నీవు దాని ననుష్ఠించుము. "ముందురాబోవువారి కీ సంగతిని తెలియజేయుట మంచిది. ఈ ప్రకారము నడచుట చేత, దైవానుగ్రహమువలన, నేను వృద్ధాప్యములో సుఖజీవనమును బొందితిని. రాబోవు కష్టసుఖములు దై వాధీనములు. ఒక వేళ నవి వచ్చినను, గతములో ననుభవించిన వానిని జ్ఞప్తికి దెచ్చు