పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. సామెతలు, పద్యములు సరసమైనవి, సరసము లేని నీరసము కాని విశేషములు లేవు.

"ఇందులోని సత్యమేమన, నేను కటిక దరిద్రుడను. నాభార్య మంచిది, గర్విష్ఠి, నారగుడ్డలు కట్టుకొని, రాట్నము నొద్దను గూర్చొనుట కామె యిష్టపడదు. పనిలేక, నేను నక్షత్రములను జూచుచుందు నని నామీద నామెకు గోపము. నా పుస్తకములను తగుల పెట్టుదనని, నన్ను భయ పెట్టును. అందుచేత, నామె కోరినప్రకారము, లాభమగు పని నేదైన నేను చేయవలయునుగదా! తదనుగుణముగ, వీనిని నారంభించితిని" అని పూరురిచ్ఛర్డు పంచాంగములో లిఖింపబడెను. మరియొక పర్యాయము, ఒక జత చెప్పులు, రెండు నారపంచ లామెకు, నాకొక కోటును కొనినాను. ఇదివఱకు కోటు లేనందున, బయటకు పోవుటకు సిగ్గుపడితిని. ఆమె కోపము కొంచెము తగ్గినది. అందుచేత, మునుపటికంటె, నిప్పుడు రాత్రి వేళల స్వస్థగ నిద్రించుచుంటిని" అని 'పూరురిచ్ఛర్డు'లో వ్రాయబడెను. ఇందులో కొన్ని సరసముగ వ్రాయబడిన సంగతులు నిందు పొందుపఱచుచున్నారము:- "కొట్టవలెను, ప్రేమించవలెను". "బంగారమును పరీక్షించునది నిప్పు; స్త్రీని, బంగారము, పురుషుని, స్త్రీ". "నూతనమైన సత్యము, సత్యమే, పురాతనమైన తప్పు, తప్పే", 'ఇరువురు చనిపోయిన, మువ్వురు రహస్యముగ నుంచ