పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదువరియై, కీర్తిప్రతిష్ఠలను బొందిన బెంజమిను వ్యవహారస్థుడుగ నెటులవన్నె కెక్కెనో మనమికను చూడవలయును. 1728 సంవత్సరము మొదలు 1748 సంవత్సరము వఱకు మంచి వ్యవహారస్థుడని బెంజమిను పేరొందెను. ముద్రకుడు, గ్రంధసవరణీకుడు, కూర్పువాడు, ప్రకటించువాడుగ, నితడుండెను. సిరా, చీటిగుడ్డలు, సబ్బు, బాతు రెక్కలు, మొదలగువాని నిత డమ్ముచుండెను. దేశ సమాచారములను దెలిసికొనుట కితని దుకాణమున కందఱు వచ్చుచుందురు.

'ఫెన్సిలువానియా గెజెటు' అను వార్తాపత్రిక మునుపటికంటె వెల్లడిగ వ్యాపించెను. ఇది నూతన సీమలలో వన్నెకెక్కెను. అక్కడివారికి సోదరభావమును బుట్టించెను, ప్రజల కుపకార బుద్ధిని బోధించెను. శాస్త్రోక్తప్రకరణములు, వ్యాసములు, సమాచారములు, వర్తక విశేషములును గలిగి. వీనిని ధారాళముగ వ్రాయుచు, మత భేదముల నిది బోగొట్టుచుండెను.

1732 సంవత్సరము డిశంబరులో, 'పూరురిచ్ఛర్డు' అను పేరు పెట్టి, యొక పంచాంగము నితడు ప్రకటించెను. ఇది నాలుగువైపులను వ్యాపించినది. దీనిలో గంభీరమైన నీతివాక్యములు కలవు. ఇది హాస్యరసము ప్రధానముగ కలిగియుండెను. ఇది సరసమైన పంచాంగము. ఇందు ఉపోద్ఘాతములు, ప్రకటనలు ప్రకృతి విశేషములు, గ్రహణములు, వింతగవ్రాయబడు