పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్టోబరు నెలలో బుస్తకములు వచ్చెను. సమాజము వారొకనిని భాండాగారపు కార్యదర్శిగ నియమించిరి. వారములో నొకరోజున ప్రతివాడు పుస్తకములను తెచ్చుకొనుచుండెను. రెండవ సంవత్సరములో బెంజమిను కార్యదర్శిగ నుండెను. దీని ననుసరించి దేశమం దంతటను మఱికొన్ని భాండాగారములు లేచెను. 1785 సంవత్సరములో 5487, 1807 సంవత్సరములో 14,457, 1861 సంవత్సరములో 70,000, పుస్తకము లుండెను. నూటపాతిక సంవత్సరములవఱ కవిచ్ఛిన్నముగ నిదిశ్రేయస్సు నిచ్చుచుండెను. ఇదిముందుకూడ నిటులనే యుండునని తోచుచున్నది. మంచికట్టు దిట్టము లేర్పఱచి, వ్యవహారమును బాగుగ జరిపించి, బెంజమిను, వీని స్నేహితులు, దీనిని శ్రద్ధతో జూచినందున, నింత యభివృద్ధిలోని కీ భాండాగారము వచ్చెను. "తామస్సు పెన్ను" అను నతడు ఫిలడల్‌ఫియాకు వచ్చినపుడు, వాని దర్శనమునకు వెళ్లి, కార్యవాహకు లొక విన్నపమును జదివిరి. అతడు సంతసించి, బహుమానముగ గొన్నిపుస్తకముల నిచ్చెను. "గ్రంధపఠన, నాగరీకమైనపని యని, యెన్నబడెను. పఠనమునుండి వీరిని విడదీయుటకు తగిన వినోదము లా కాలమున లేనందున, వీరు గ్రంథావలోకనము చేయుచు కాలము వ్యయముచేసిరి. ఆ కాలమం దన్య దేశీయులకంటె, బాగుగ గ్రంధములను జదువువారువీరే" యని బెంజమిను వ్రాసెను.