పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి నిదర్శనము లనన్యాదృశంబులు; వారి యనుభవములు మనుజుల కనుబోధము; వారిరాకలు మేలురాకలు, వారి సంభాషణలు మోహాంధకారవిదళన చంద్రికలు. వారి సఖ్యము శ్రేయోదాయకము, వారి యుపదేశము శ్రోతవ్యము. వారి సంపర్కము షడ్గుణైశ్వర్య సంధానకరణి. వారు నిర్మలులు, నిష్కళంకులు, నిరాశ్రయులు, నిత్యతృప్తులు, నిరాభాసులు. వారు లక్ష్యైకాగ్రచిత్తులు, సిద్ధసంకల్పులు, మృతజీవులు. వారి యాచరణవిధానము నుపలక్షించి, తద్విధమున దేశ కాలానుగుణ్యముగ గమనించుట మనుజులకు కర్తవ్యంబు.

ఆంధ్రభాషయందు పుశ్చాత్యమహాపురుష జీవితచరిత్రంబులు లోపంబులు. తల్లోపపూరితార్థం బీ మదీయపధమ్రోద్యమంబు. ఈ గ్రంధము స్వకల్పనశక్తిశూన్యంబు, సరసవచన విరహితంబు. ఈ చరిత్రములు "బుధులకు నవనిధుల దాపురంబును విపులజయలక్ష్మికి గాపురంబును" గనుక, మదీయ లోపంబులు సహ్యంబులగుగాక.

ఇంతియకాదు ఆంధ్రదేశముననుండు "సకలకళావిభూషితులు శబ్దవిదు ల్న యతత్త్వబోధకుల్ప్రకటకవీంద్రు" లందఱు తమ తమ శక్త్యానుసార మాంధ్ర మాతను "ప్రీతిపూర్వకంబుగా జతుర్విధ శుశ్రూషలు గావించుచు సేవించుచు బూజించుచు భావించుచు నమస్కరించుచు నారాధించు"చున్న