పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

                     శ్లో|| క్వసూర్య: ప్రభవో వంశ క్వచాల్పవిషయామతి |
                     తతీర్షుగున్‌స్తరం మోహాదుడు పేనాస్మిసాగరం ||
                     మందరం కవియశం ప్రార్ధిగమిష్యామ్యపహాస్యతాం |
                     ప్రాంశు లభ్యే ఫలే లోభా మద్బాహురివవామన: ||

                                                      కాళిదాసు, రఘు 1 - 3-4


లోకము కర్మసూత్రగ్రధితము కర్మము ద్వివిధము : స్తోకమని, అస్తోక మని. మనుజుడు కర్మిష్ఠి. కర్మ లేని భోగం బపోహంబు. అసందర్భంబు లసంభవములు. వర్తమాన దు:ఖంబులు భూతకాల స్వకర్మోపార్జితంబులు, స్వస్తోకకర్మోద్భవంబులు - ఇవి యసాధువులు, రిక్తములు, దేశాభివృద్ధి నిరోధకములు. ఆ హేతువం జేసి త్యాజ్యంబులు స్తోకకర్మిష్ఠులు కనిష్ఠులు.

వర్తమానమెటుల భూతకాలభవమో, అటులనె, భవిష్యత్కాలము వర్త మానోద్భవము. భవిష్యత్కాలభోగంబులకు వర్తమానకర్మ లుపాదానంబులు. ఆ కారణముం జేసి, అస్తోకకర్మ లనుష్ఠేయంబులు.అస్తోకకర్మిష్ఠులు. గర్విష్ఠులు. స్వాస్తోకకర్మ లతి రేకములు. అతిపధమునకు గర్విష్ఠు లధ్వగులు.