పుట:Balavyakaranamu018417mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుట, ఎఱుంగుట - వినుట ఇత్యాది, భవనము - పుట్టుట, త్రాణము - కాచుట, విరామము - విరమించుట, అంతర్థి - మఁఱుగుట, వారణము - వారించుట. అపాయంబునకు - మైత్రుండు రాజ్యంబువలన భ్రష్టుండయ్యె. భయంబునకు - చోరునివలన భయపడియె. జుగుప్సకు - పాపంబు వలన నేవగించె. పరాజయమునకు - అధ్యయనము వలన డస్సె. ప్రమాదంబునకు - పాడివలనం బరాకు వడియె. గ్రహణంబునకు - మైత్రుని వలన ధనంబు గొనియె. భవనంబునకు - మనువు వలనం బ్రజలు పుట్టిరి. త్రాణంబునకు - చోరునివలనం గాచె. విరామంబునకు - భోగంబుల వలన విరమించె. అంతర్థికి - కృష్ణుండు తల్లి వలన దాఁగె. వారణంబునకు - శోకంబువలన వారించె. ఈ పంచమికి షష్ఠియుం గొండొకయెడల నగు. చోఱునకు వెఱచె. పాపంబున కేవగించె. అధ్యయనంబునకు డస్సె. పాడికిం బరాకువడియె. మనువునకు నిక్ష్వాకుండు పుట్టె - ఇత్యాదు లూహించునది.

10. ఉండిపదం బొకానొకచో వలన వర్ణకంబున కనుప్రయుక్తంబగు.

హిమగిరివలన నుండి గంగవొడమె - నాకంబువలన నుండి నారదుండు వచ్చె.

11. ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్తములు ప్రాయికంబుగ నగు.

వనమునుండి వచ్చె - వనమందుండి వచ్చె. ఊరినుండి వచ్చె