పుట:Balavyakaranamu018417mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. వచ్యర్థాముఖ్యకర్మంబునకుఁ దోడఁ కువర్ణకంబులు ప్రాయికంబుగా నగు.

మైత్రుండు చైత్రుని తోడ నిట్లనియె - మైత్రుండు చైత్రున కిట్లనియె. ప్రాయికం బనుటచే వొకానొకచో ద్వితీయయునగు.

7. ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవర్ణకం బగు.

నియమపూర్వక విద్యాస్వీకారం బుపయోగం బనంబడు. రామకృష్ణులు సాందీపునితోడ వేదంబుల జదివిరి - సాందీపునివలన నని యర్థము.

8. సంప్రదానంబునకుం జతుర్థి యగు.

త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాఁబడు. జనకుండు రాముని కొఱకుఁ గన్యనిచ్చెను. కొన్నియెడల నుద్దేశ్యమాత్రంబున కగు. పురుషార్థంబు కొఱకు ప్రయత్నింపవలయు. చతుర్థికి మాఱుగా షష్ఠియె తఱచుగా బ్రయోగంబులం గానంబడియెడి. జనకుండు రామునకుం గన్యనిచ్చెను. పురుషార్థంబునకు యత్నింపవలయు.

9. అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ విరామాంతర్థి వారణంబు లెద్దాననగు, దానికి వలన వర్ణంకం బగు.

అపాయము - విశ్లేషము, భయము - వెఱపు, జుగుప్స - ఏవ, పరాజయము - దయ్యుట, ప్రమాదము - పరాకు, గ్రహణము