పుట:Balavyakaranamu018417mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదంబులును - వలె ప్రభృతులును - ద్రుతప్రకృతికంబులు. నన్నున్ - నాచేతన్ - నాతోడన్ - నాకొఱకున్ - నావలన్ - నాకంటెన్ - నాకున్ - మాలోపలన్ - మాయందున్ - వత్తున్ - వచ్చెదన్ - వచ్చెన్ - వచ్చున్ - వచ్చెడున్ - ప్రసన్నులయ్యెడున్ - కావుతన్ - కొట్టుచున్ - కొట్టన్ - కొట్టగన్ - కొట్టుడున్ - కొట్టినన్ - వలెన్ - ఎంతయున్ - పోలెన్ - అయ్యున్ - ఇత్యాదులూహ్యంబులు.

13. ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళలనంబడు.

రాముఁడు - రాములు - హయము - విష్ణువు - గోడ - మేడ - అయ్య - అమ్మ - రామునికయి - జ్ఞానముఁబట్తి - నాయొక్క - వచ్చిరి - వచ్చితివి - వచ్చితిరి - వచ్చితిమి - రాఁడు - రారు - రాదు - రావు - రాము - కొట్టక - తిట్టక - ఎత్తిలి - ఒత్తిలి - ఊరక - మిన్నక - బళి - అక్కట - ఏల - ఇత్యాదు లూహించునది.

14. హ్రస్వముమీఁది ఖండబిందువునకుఁ పూర్ణబిందువు వైకల్పికముగ నగును.

ఆడఁకువ - ఆడంకువ - అరఁటి - అరంటి - ఎఱుఁగుట - ఎఱుంగుట - బలఁగము - బలంగము - మగఁటిమి - మగంటిమి.

15. దీర్ఘముమీద సాధ్యపూర్ణము లేదు.

వాఁడు - వీఁడు - రాఁడు - లేఁడు - కాఁబోలు - కాఁబట్టి - గోఁగులు - రేఁగులు.