పుట:Balavyakaranamu018417mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ౘలి - ~ఛాప - ౘ్ఉక్క - ౘ్ఊపు - ౘ్ఒక్కు - ౘ్ఓటు - ౘఉక - ౙముడు - ౙఅతర - ౙ్ఉన్ను - ౙ్ఒన్న - ౙఅలి - ౙ్ఓకు. ఐదంతము లయిన చ జలు సమేతర శబ్దములందు లేవు.

10. సంస్కృత సమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చ జ లు బహువచనంబు పరంబగునపుడు దంత్యము లగును.

ఇవి దప్ప సంస్కృత సమంబులందు దంత్య చ జలు లేవని తాత్పర్యము. ఉపధ యనగా దుదివర్ణమునకు ముందువర్ణము అర్చి-అర్చులు; రోచి-రోచులు; వీచి-వీచులు; రాజి-రాజిలు; వాజి-వాజులు. మరియు రాజుశబ్దం బొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి. ఇతరములయిన చ జల కుదాహరణములు; చంద్రుడు - చామరము - చుక్రిక - చూర్ణము - చోరుడు - చౌర్యము - జయము - జాతి - జుగుప్స - జూటము - ఇత్యాదులు.

11. నకారంబు ద్రుతంబు.

12. ద్రుతాంతములయిన పదములు ద్రుత ప్రకృతికములు.

ఉత్తమ పురుషైకవనంబులు - భూత తద్ధర్మాద్యక్షర ప్రథమ పురుషైకవచనంబులు - ఆశీరాద్యర్థంబులయిన యెడు త వర్ణకంబులు - శతృ తుమా నంతర్య చేదాద్యర్థంకంబులు - నేను తాను