పుట:Balavyakaranamu018417mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. సంస్కృత సమేతరము లయిన తెలుఁగు శబ్దములయందుఁ బరుష సరళంబులకు ముందే బిందువు కానంబడుచున్నది.

వంకర - కలఁకువ - మంౘు - త్రాఁౘు - దంట - దాఁటు - కొంత - కోఁత ఇత్యాదు లూహ్యంబులు.

17. యకారంబును వు వూ వొ వో లును దెలుఁగు మాటలకు మొదట లేవు.

ఎవఁడు - ఎక్కడ - ఏమి - ఏల - ఉండ - ఊరు - ఒకడు - ఓడ - హరియతఁడు - నిద్రవోయె నిట్టిచోట్ల సంధి వశంబున వచ్చిన యకార వకారంబులుగాని పూర్వసిద్ధంబులు గావు. వోఢృ వోఢవ్య శబ్దములు దప్ప సంస్కృత సమంబులందు సహితము వు వూ వొ వో వర్ణాదులగు శబ్దంబులు లేవని యెఱుంగునది. ఉదకము - ఊర్మిక - ఓదనము.

18. య ర ల వ లు లఘువులని యలఘువులని ద్వివిధంబు లగు.

హరియతఁడు ఇత్యాదులం దాగమ యకారము లఘువు, తక్కిన యకారమలఘువు. విఱుగు, మెఱు గిత్యాదులందు రేఫంబలఘువు. ఇదే శకటరేఫమని చెప్పబడును. శకట రేఫము తత్సమ తద్భవములందు లేదు. పెరుఁగు కరు గిత్యాదులందు రేఫంబు లఘువు. ఏళులు పాళులు త్రాళులని బహుత్వమందు రలడల కాదేశ మయిన ళకార మలఘువు. తల, నెల యిత్యాదు