పుట:Balavyakaranamu018417mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. టి తి వర్ణకంబులు పరంబులగునపు డుత్వంబున కిత్వం బగు.

రెంటిని - మూఁడిటికి - నాలుగిటికి - పగలిటికి - మొదలిటికి - పెక్కిటికి. కొండొకచో నుత్వంబున కిత్వంబు చూపట్టదు - నెత్తుటికి.

37. టి వర్ణంబు పరంబగునపుడు క్రిందు మీఁదు ముందు పువర్ణంబుల కత్వం బగు.

క్రిందు - క్రిందటిని, మీఁదు - మీఁదటిని, ముందు - ముందటిని, మాపు - మాపటిని, అప్పుడు - అప్పటిని.

38. ఔపవిభక్తికముల తృతీయాసప్తముల కత్వం బాదేశంబు బహుళంబుగా నగు.

గోరను గీరెను, ఊరనున్నాడు, గొడ్డట నరెకెను, ఇంటలేఁడు, వఱుతఁ గలిసె, కఱతఁ దూటె. పక్షంబునందుఁ గోరిచేత నూరియం దిత్యాదులు.

ఇది యాచ్ఛిక పరిఛ్ఛేదము.