పుట:Balavyakaranamu018417mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదిటిని, వేయి - వేయిటిని. ఉభయము: ఏమి - ఏటిని - ఏమిటిని, పగలు - పగటిని - పగలిటిని, మొదలు - మొదటిని - మొదలిటిని, రెండు - రెంటిని - రెండింటిని, మూఁడు - మూటిని - మూఁడిటిని, నూఱు - నూటిని - నూఱిటిని.

32. హ్రస్వముమీఁది టి వర్ణకంబు ముందు పూర్ణబిందువు బహుళముగానగు.

అన్నింటిని, ఎనిమిదింటిని, పగంటిని, పగలింటిని, రెండింటిని, మూఁడింటిని.

33. పదాద్యం బగు హ్రస్వంబుమీఁది టి వర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.

కన్ను - కంటిని, మిన్ను - మింటిని, ఇల్లు - ఇంటిని, పల్లు - పంటిని.

34. అఱ్ఱు మొదలగు శబ్దముల కంతాగమంబు తి వర్ణంబును రేఫంబున కొక్కటికి లోపంబు నగు.

అఱ్ఱు - అఱితిని. అఱ్ఱు - కఱ్ఱు - కొఱ్ఱు - గొఱ్ఱు - ముఱ్ఱు - వఱ్ఱు ఇవి యఱ్ఱు మొదలయినవి.

35. విభక్తి పరంబగునపుడు గోయి ప్రభృతుల తుదియక్షరంబు తి వర్ణకం బగు.

గోయి - గోతులు - గోతిని - గోతులను. గోయి - చేయి - దాయి - నూయి - నేయి - వాయి - రోయి ఇత్యాదులు.