పుట:Balavyakaranamu018417mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఔపవిభక్తిక ప్రకరణము

28. ఇ టి తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.

29. విభక్తి నిమిత్తకంబులయి యాదేశాగమాత్మకంబులయిన ఇ - టి - తి అను వర్ణంబు లౌపవిభక్తికంబు లనంబడు. ఇవి ద్వితీయాద్యేక వచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.

కాలు - కాలిని - కాలిచే, నాఁగలి - నాఁగటిని - నాఁగటిచే, నేయి - నేతిని - నేతిచే. ద్వితీయైక వచనంబు పరంబగు నపు డౌపవిభక్తికంబులు రావని కొందఱు వక్కాణించిరి. అయ్యది లక్ష్యలక్షణ విరుద్ధంబగుటంజేసి యనాదరణీయంబు.

30. ఊరు మొదలగువాని కిత్వం బగు.

ఊరు - ఊరిని, కాలు - కాలిని, మ్రాను - మ్రానిని, నోరు - నోరిని, చోటు - చోటుని.

31. టి వర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.

ఆదేశము: త్రాడు - త్రాటిని, కాఁడు - కాటిని, నోరు - నోటిని, ఏఱు - ఏటిని. ఆగమము: ఆన్ని - అన్నిటిని, ఎనిమిది