పుట:Balavyakaranamu018417mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారక పరిచ్ఛేదము.

1. ప్రాతిపదిక సంబోధనోక్తార్థంబులం బ్రథమ యగు.

ప్రాతిపదికార్థమునందు : రాముఁడు - రావణుఁడు. నియతోపస్థితికము - ప్రాతిపదికార్థము. సంబోధనమునందు: ఓరాముఁడ - ఓరావణుఁడ. ఉక్తార్థమందు: రాముఁడు రావణుని సంహరించెను. ఉక్తమనఁగా చెప్పబఁడినది. ఈ వాక్యమందు నాఖ్యాతము కర్తను జెప్పినది గావునఁ దద్వాచకమగు రామ శబ్దమునకుఁ బ్రథమమయ్యె. రామునిచే రావణుఁడు సంహరింపఁ బడియె. ఈ వాక్యమం దాఖ్యాతము కర్మమును జెప్పినది గావునఁ దద్వాచకంబగు రావణ శబ్దమునకుం బ్రథమమయ్యెనని యెఱుంగునది.

2. కర్మంబున ద్వితీయ యగు.

ధాత్వర్థఫలాశ్రయంబు కర్మము నాఁబడు. దేవదత్తుఁడు వంటకమును వండెను. ఇట వండె ననుమాటకు వంట చేసెనని యర్థము. వంట ఫలము - చేయుట వ్యాపారము. వంట యనంగ బాకము. పాకమున కాశ్రయము కావుటంజేసి వంటకము కర్మం బయ్యెనని యెఱుంగునది.

3. చేతవర్ణకంబు కర్త కగు.

ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాఁబడు. దేవదత్తుని