పుట:Balavyakaranamu018417mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. కూఁతు శబ్దము ప్రథమైకవచనంబునకు రువర్ణం బగు.

కూఁతురు - కూఁతులు - కూఁతురులు - కూతుళ్ళు. కూఁతురి నిత్యాది రూపంబులు గ్రామ్యంబులని యెఱుంగునది.

10. చెయువు బహువచన లకారంబున కలఘురేఫంబు విభాష నగు.

చెయువుఱు -చెయువులు - చెయువుఱను - చెయివులను.

11. ఆల్వాదుల బహువచన లకారంబునకు రేఫంబును ముందఱి లువర్ణంబునకు బిందుపూర్వక డకారంబు నగు.

ఆండ్రు, ఆండ్రను, ఆలు, చెలియలు, చెల్లెలు, కోడలు, మఱఁదులు ఇవి యాల్వాదులు.

12. బహువచనము పరంబగునపుడు డ ల ట ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు.

గుండ్లు - గుండులు, గిండ్లు - గిండులు, కాళ్ళు - కాలులు, మొసళ్ళు - మొసలులు, గొండ్లు - గొంటులు, తుంట్లు - తుంటులు, గోర్లు - గోరులు, సీవిర్లు - సీవిరులు. బహుళగ్రహణముచే విల్లులు, పిల్లులు, పులు లిత్యాదులందు లోపంబులేదు. తత్సమంబులం గోటి పిప్పలిశబ్దంబుల కీకార్యంబు చూపట్టెడు. కోట్లు - కోటులు, పిప్పళ్ళు - పిప్పలులు.