పుట:Balavyakaranamu018417mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. బహువచనము పరంబగునపు డసంయుక్తంబులయి యుదంతంబులయిన డ ల ర ల కలఘు లకారంబు బహుళంబుగా నగు.

త్రాళులు - త్రాడులు, గుమ్మళులు - గుమ్మడులు, మొగిళులు - మొగిలులు, పిడికిళులు - పిడికిలులు, ఊళులు - ఊరులు, పందిళులు - పందిరులు.

14. బహువచన శ్లిష్టంబులయి యద్విరుక్తంబులయిన డకార లకారంబుల కలఘు లకారంబు నిత్యంబుగ నగు.

త్రాళ్ళు, గుమ్మళ్ళు, మొగిళ్ళు, మొసళ్ళు, విళ్ళు, సిళ్ళు.

15. సమాసపదంబునందు సంయోగంబు పరంబగునపుడెల్లచో ఖండబిందునకుం బూర్ణం బగు.

అనఁటులు - అనంట్లు, పనఁటులు - పనంట్లు, గోఁటులు - గోంట్లు, తేఁటులు - తేంట్లు, ఏఁడులు - ఏండ్లు, కాఁడులు - కాండ్లు. ఏండ్లు కాండ్లి త్యాదులందు డాకు ళాదేశంబు కొండఱు వక్కాణించిరి. తెనుఁగున బిందుపూర్వక స్థిరంబు లేమింజేసి యది గ్రాహ్యంబుగాదు.

16. ఔపవిభక్తికంబుల లివర్ణ స ల లు వర్ణంబులకు బహువచనంబు పరంబగునపుడు పూర్ణబిందుపూర్వక డువర్ణంబు బహుళంబుగా నగు.