పుట:Balavyakaranamu018417mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొడవలి - కొడవండులు. ఉల్లోపంబు -కొడవండ్లు. పక్షంబునం దలఘులకారంబు - కొడవళ్ళులు - కొడవళు - కొడవలులు. రోఁకలి ప్రభృతుల కిట్లు రూపంబు లెఱుంగునది. ఇల్లు - ఇండులు - ఇండ్లు - ఇల్లులు. ఇట్లు కల్లు, పల్లు, ముల్లు, విల్లు శబ్దంబులకు రూపంబులు తెలియునది. మధ్య నిమ్నార్థకంబులయిన కల్లు, పల్లు శబ్దంబులు ఱెల్లు ప్రభృతి శబ్దంబులు ననౌపవిభక్తికంబు లగుటంజేసి వానికీ కార్యంబు లేదు.

17. ఒకానొకచో నామంబు సంశ్లిష్ట బహువచనాంత తుల్యంబయి బహువచనంబు నెనయు.

కొడవండ్లులు - కొడవండ్లులను, కొడవళ్ళులు - కొడవళ్లులను ఇట్లు ప్రయోగదృష్టంబులు గ్రహించునది.

18. కలన్వాదుల నువర్ణంబు కుఙ్ఙగు; బహువచనము పరంబగునపుడు నిత్యముగా నగు.

కలఁకు - కలను - కలఁకులు - కలను - కెలను - కొఱకు - కొలను - గవను - నెఱను - మ్రాను - వరను - వలను. ఇవి కలన్వాదులు.

19. అట్లు రేను గోను శబ్దముల నువర్ణంబు గుఙ్ఙగు.

రేఁగు - రేను - రేఁగులు, గోఁగు - గోను - గోఁగులు.

20. బహువచనంబు పరంబగునపుడు చేను పేను మీను శబ్దంబుల నువర్ణంబు లోపించు.

చేను - చేలు, పేను - పేలు, మీను - మీలు.