పుట:Balavyakaranamu018417mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగఁడు - మనుమఁడు - కయిరఁడు - కత్తళఁడు. మగ - మనుమ - రాయ - పాప - వ్రే - ఱే - ఈ - కా ప్రత్యయాంతంబులు ఇత్యాదులు మగాదులు. కయిర - కత్తళ - జన్న - నీల ఇత్యాదులు కయిరాదులు.

5. పగతాదుల బహువచన లకారంబునకు రేఫం బగు.

పగతురు - అల్లురు - నెయ్యురు - బలియురు - మార్తురు.

6. కొన్ని డుమంతంబుల బహువచన లకారంబునకు రేఫంబును, దానికి ముందు పూర్ణబిందు పూర్వక డకారంబు నగు.

గండ్రండు - మిండ్రండు ఇత్యాదులు.

7. కాప్రత్యయంబుమీఁది బహువచన లకారంబునకు లఘ్వలఘురేఫంబులును, లఘురేఫంబునకు ముందు బిందుపూర్వక డకారంబు నగు.

విలుకాండ్రు - విలుకాఱు, వేఁటకాండ్రు - వేఁటకాఱు, వేడుకకాండ్రు - వేడుకకాఱు.

8. ఱే ప్రభృతుల బహువచనమునకు ముందు డుఙ్ఙగు.

ఱేఁడులు - ఱేండ్లు.